24-09-2025 07:16:25 PM
అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానాలు
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి పట్టణంలోని పాత బజార్ లో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబ సమేత కమటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడోరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి భక్తులు, భవాని మాల దారణ గావించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. అన్నపూర్ణ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం దాదాపు 600 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... అమ్మవారి యొక్క మహిమలు మహిమానితమని, అమ్మవారిని కొలిచిన వారికి కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వసించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. దాదాపుగా 30 మంది భవాని మాల స్వీకరించారు.