24-09-2025 07:21:28 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగ సందర్భంగా బుధవారం సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు సంబంధించి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పట్టణ పరిధిలోని బతుకమ్మ ఘాట్ల వద్ద పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించి ఎలాంటి ఆటుపోటులు లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు శానిటేషన్ సిబ్బంది శ్రావణ్ కుమార్,రాజ్ కుమార్ పలువురు పాల్గొన్నారు ,