16-07-2025 12:00:00 AM
బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్ జూలై 15 : దైవభక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బోనాల పండుగ సందర్భంగా దివిటిపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో, పట్టణంలోని రవీంద్ర నగర్ శీతాల దేవి పోచమ్మ తల్లి ఆలయంలో, గణేష్ నగర్ లోని పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగకు ఎమ్మెల్యేఎమ్మెల్యే హాజరై అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూఅమ్మ వారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన అమ్మ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యద ర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు వేద వ్రత్, శాంతన్న యాదవ్, అంజయ్య, ప్ర శాంత్, ఖాజా పాషా, రషెద్ ఖాన్, నాయకులు మద్దూరి రాఘవేందర్, లీడర్ రఘు, డీలర్ రఘు, బండ్ల గేరి చిన్న, నాయకులు జేసిఆర్ , శివప్రసాద్ రెడ్డి, సిరిగిరి మురళీధర్, అనుప ఆంజనేయులు, చర్ల శ్రీనివాసులు, శ్రీశైలం , తదితరులుపాల్గొన్నారు.