calender_icon.png 17 August, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో గోకులాష్టమి

17-08-2025 01:04:51 AM

-  కొమురవెల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి); సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జానపద తరహాలో శ్రీకృష్ణ, గొల్లభామ వేషధారణలతో ఆలయ ప్రాంగణంలో యాదవ పూజారులు ఉట్టి కొట్టారు. అనంతరం ఉత్సవమూర్తులకు పూజలు చేసి, పురవీధుల్లో భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. అంతకుముందు చెట్టు కింద పెద్దపట్నం వేసి పూజలు నిర్వహించారు. వేడకల్లో ఈవో అన్నపూర్ణ, ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్, ఒగ్గు పూజారులు బొద్దుల కనకయ్య, అత్తిలి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.