calender_icon.png 17 August, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు

17-08-2025 01:03:49 AM

-కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్నాయి

-సిట్ విచారణ జరపాలి

-బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాం తి): మేడిగడ్డ బ్యారేజీ వద్ద అక్టోబర్ 21, 2023న పెద్దఎత్తున బాంబులు పేలిన శబ్దా లు వచ్చాయని, మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని, ఇందుకు కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రపన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడా రు. నాడు బాంబు పేలిన ఆ శబ్దాలు సుమా రు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయ ని, వెంటనే స్థానిక రవికాంత్ అనే ఇంజినీర్ మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు 174/2023 కింద కేసు నమోదు చేశారని, కానీ ఇప్పటివరకు తిరిగి ఆ కేసు గురించి పట్టించుకోలేదన్నారు.

ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదులో అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్రలు చేసినట్లుగా అనుమానం ఉందని తెలిపారు. కానీ పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదని, అలాగని లాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేయలేదని, గత రెండేళ్లుగా కేసు అలాగే పెండింగ్‌లోనే ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, జెలెటిక్స్ ఎక్స్ ప్లోజన్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించాల్సిందని, పిల్లర్ సాంపుల్స్, ఇసుక సాంపు ల్స్, సీస్ పిక్ రిపోర్టు తీసుకొని సంబంధిత శాఖా ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయాల్సిందన్నారు.

సిట్ విచారణ జరపాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింద ని అప్పటికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష నాయకులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిల కాల్ డేటాతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఆ రోజు తిరిగిన అనుమానాస్పద వ్యక్తుల కాల్ డాటా సేకరించాల్సిందని, కానీ పోలీసులు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. అదే సమయంలో 2023  జూన్ నెలలో ఉత్తరాఖండ్ లోని తియస్తా నదిపై నిర్మించిన బ్యారేజీ మొత్తం వరదలకు కొట్టుకుపోయిందని, అక్కడికి వెళ్లని ఎన్‌డీఎస్‌ఏ కేవలం తెలంగాణకు మాత్రమే అకస్మాత్తుగా ఎలా వచ్చింద ని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కావాలని అధికారం నుంచి బీఆర్‌ఎస్‌ను తప్పిం చాలనే కుట్రలో భాగంగానే ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశారన్నారు. దీనిపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.