16 June, 2026 | 3:38 AM

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించాలి

16-06-2026 02:36 AM

కలెక్టర్‌కు విన్నవించిన బిల్డర్లు 

మేడ్చల్, జూన్ 15 (విజయ క్రాంతి): ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బిల్డర్లు కలెక్టర్ను వినతి పత్రం సమర్పించారు. గత రెండు వారాల కిందట నుంచి ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో ప్రైవే టు భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏవీ కన్ స్ట్రక్షన్స్ ఎండీ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉప్పల్ బిల్డర్స్ అసోసియోషన్ అధ్యక్షులు ఆకుల సత్యనారయణ ఆధ్వర్యంలో సోమవారం బోడుప్పల్, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్స్ పరిధిలోని రియాల్టర్లు, బిల్డర్లు, బయ్యర్లు, వివిధ కాలనీల ప్రతినిధులు అం తాయిపల్లిలోని కలెక్టర్ కార్యాయలంలో  కలెక్టర్ను  ప్రత్యేకంగా కలిసి రిజిస్ట్రేషన్ల సమస్య లపై విన్నవించారు.

ఒక సర్వే నెంబర్లోని కొంత విస్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ ఆ సర్వే నెంబర్లోని మొ త్తం భూ విస్తీర్ణంను 22-ఏ లో చేర్చడం వలన పట్టాదారులు, రియాల్టర్లు, బిల్డర్లు, బయ్యర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడుతూనే తమకు చెందిన ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.  కలెక్టర్ను కలిసిన వారిలో  బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త రవిగౌడ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ కార్పోరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సామ సతీష్ రెడ్డి, బిల్డర్లు రమేష్, జనార్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మల్లారెడ్డి, బాల్రెడ్డి, అరూణ్, నర్సింహ్మారెడ్డి, కోనేటి వెంకట్, యాసారం శ్రీనివాస్, మునికుంట కిరణ్ గౌడ్, అశోక్, శ్రీకాంత్,  తదితరులు ఉన్నారు.