ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై అవగాహన
16-06-2026 02:34 AM
ఇబ్రహీంపట్నం, జూన్ 15: మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతు వేదిక యందు కేంద్ర ప్రభుత్వ నూతన ‘ఫర్టిలైజర్ బుకింగ్ ఆప్ రంగారెడ్డి జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైనందున, ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆసక్తిగా హాజరై న రైతులు, ప్రజా ప్రతినిధులు, మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్, ఎరువుల డీలర్లకు, వాలంటీర్లకు అవగాహన కల్పించడం జరిగింది. వారు చేసిన సూచనలు సైతం పై అధికారుల దృష్టి కి తీసుకువెళ్ళి, పైలెట్ దశ లో ఉన్న ఆప్ ను సులభంగా ఉపయోగించే విధంగా మార్పులు చేస్తమని తెలియజేసారు. ఇందులో కొందరు రైతులకు సైతం ఎరువులు బుకింగ్ చేసి చూపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యం.విద్యాదరి. ఇంచార్జిలు, రైతులు పాల్గొన్నారు.






