calender_icon.png 14 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రయ్.. రయ్..

13-05-2025 12:00:00 AM

  1. రాకెట్‌లా దూసుకెళ్లిన సూచీలు

మదుపర్ల సంపద రూ.16 లక్షల కోట్లుపైకి

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై, మే 12: భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరావవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా వాణిజ్య చర్చలు, రష్యా మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి వంటి పలు అంతర్జాతీయ అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. దీంతో భారత సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. మదుపర్ల సంపద రూ.16 లక్షల కోట్లు పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది.

ఇంట్రాడేలో సెన్సెక్స్ 3 వేల పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25 వేల మార్క్‌కు కొంత దూరంలో నిలిచింది. 2024, డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలు ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. భారత్ మధ్య ఉద్రిక్తతలు చల్లారిన నేపథ్యంలో సెన్సెక్స్ ఆరంభంలోనే 80,803.80 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,454.47) భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే దూకుడును కొనసాగించి..

ఇంట్రాడేలో 3 వేల పాయింట్లకు పైగా లాభంతో 82,495.97 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2975.43 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 916.70 పాయింట్ల లాభంతో 24,924.70 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరిగింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ మినహా మిగిలిన షేర్లు లాభాలు చవిచూశాయి.

ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 65 డాలర్లు, బంగారం ఔన్సు 3222 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.