14-05-2025 08:54:36 AM
హైదరాబాద్: నేడు వరంగల్ జిల్లాలో(Warangal district) మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించనున్నారు. ప్రపంచ సుందరిమణుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశారు. అందాల భామలు రెండు బృందాలుగా పర్యటించనున్నారు. వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాలను సందరిమణులు వీక్షించనున్నారు. లేజర్ షో, టైటింగ్ షోలను మిస్ వరల్డ్ పోటీదారులు తిలకించనున్నారు.
సుందరిమణుల పర్యటన దృష్ట్యా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మిస్ వరల్డ్ బ్యూటీ పేజెంట్(Miss World contestants) పోటీదారుల సందర్శన కోసం వరంగల్ కోట, వెయ్యి స్తంభాల మందిరం, రామప్ప ఆలయం అన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. ఈ మూడు ప్రదేశాలు కాకతీయుల సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే మెరిసే అందాలను కలిగి ఉన్నాయి. ఈ పోటీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలదని, తద్వారా పర్యాటక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచ సుందరిమణుల పర్యటన అధికారులు 1,000 మంది పోలీసులను మోహరించారు. రామప్పలో డ్రోన్‌లను ఎగురవేయడాన్ని నిషేధించారు.