calender_icon.png 25 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ: కలెక్టర్ అనుదీప్

25-09-2025 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బతుకమ్మ సంబరాలు పోస్టర్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ బుధవారం ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, గెజిటెడ్ అధికారులు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకోవాలని తెలుపుతూ మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగానికి ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన పి సుధరాణి, వైస్ కో చైర్‌పర్సన్, గంగవరపు ఉష్రశ్రీ వైస్ చైర్ పర్సన్, విజయ కుమారి వైస్ చైర్ పర్సన్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి పాల్గొన్నారు.