03-11-2025 11:11:34 PM
							700 ఎకరాల భూమి సేకరణ కోసం కలెక్టర్ కు ఉత్తర్వులు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు వివిధ దశల్లో సర్వేలు జరిగాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనులు వేగవంతం అవుతున్నాయి. ఇందులో భాగంగానే 700 ఎకరాల భూమిని సేకరించాలని జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర రోడ్లు భవనల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో, భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డిపిఆర్) ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పటంలో కీలక స్థానం దక్కించుకోనుంది.