calender_icon.png 4 November, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో దళితులకు అవమానం

03-11-2025 11:20:14 PM

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను అవమానిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితులను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని, దళితులకు ఇచ్చిన హామీలపై సీఎం,డిప్యూటీ సీఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

6 లక్షలు దళితులకు ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని చెప్పారని, కానీ ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పరిమితం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు దళితులకు వ్యతిరేకంగా ఉందని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.