calender_icon.png 4 November, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామ డీసీసీ పీఠం ఎవరికి?

04-11-2025 12:00:00 AM

-అధిష్టానం కొమ్మూరికి చెక్ పెట్టేనా!

-అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు   

జనగామ, నవంబర్ 3 (విజయక్రాంతి): జనగామ డిసిసి స్థానాన్ని దక్కించుకునేందుకు  కొందరు కాంగ్రెస్ నాయకులు చాకచక్యంగా పావులు కలుపుతున్నట్టు సమాచారం  ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొమ్మూరి స్థానాన్ని దక్కించుకునేందుకు తెరపైకి నాగపురి కిరణ్ గౌడ్, ఝాన్సీ రెడ్డి, ఇందిరా  కాంగ్రెస్ అధిష్టానాన్ని  ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు, జనగామలో డీసీసీ కుర్చీని దక్కించుకునేందుకు  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం జనగామ డిసిసి అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉన్నారు, జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తిలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్‌ఎస్  వీడి  కాంగ్రెస్లో చేరారు. జనగామ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. జనగామలో డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి ప్రాధాన్యం, కొనసాగుతుండగా బిఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి చేరిన కడియం జిల్లా రాజకీయాలను శాసించే  ప్రయత్నం చేస్తున్నారు, కడి యం  రాకతో స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన సింగపూర్ ఇందిరా పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.

ఆమెకు స్థానికంగా బలమైన కేడర్ ఉన్న ఎలాంటి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొదట కడియం కాంగ్రెస్లోకి రావడానికి ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హైకామాండు బుజ్జగించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని. హామీ ఇవ్వడంతో ఆమె కడియం రాకను స్వాగతించి ఎంపీ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపు కోసం కృషి చేశారు మరోవైపు పాలకుర్తిలో ఎమ్మెల్యే దగ్గరుండి మరి గెలిపిం చారు. ప్రస్తుత ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమంలో కోడలు యశస్విన్ రెడ్డి తో కలిసి పాల్గొంటారు.

ఈ క్రమంలో ఝాన్సీ రెడ్డికి ప్రోటో కాల్ సమస్య ఎదురవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్కు పెట్టచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్ గౌడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సామాజికంగా చూస్తుంటే బీసీ నినాదం వినిపిస్తున్న తరుణంలో తండ్రి ఒకప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇప్పటికే నాగపురి కిరణ్ గౌడ్ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ జనగామ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సహకారాలు అందిస్తూనే తన క్యాడర్ కాపాడుకుంటూ పావులు కలుపుతున్నారు,   కార్యకర్తలతో మంతనాలు, డిసిసి పీఠాన్ని   ఆశిస్తున్న సింగపూర్ ఇందిరా, ఝాన్సీ రెడ్డి కిరణ్ కుమార్ గౌడ్, తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఝాన్సీ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తో పరిచయాలు ఉండడంతో డిసిసి కుర్చీ కోసం నేరుగా ఆయనతోనే సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సింగపూర్ ఇందిరా తనకు హై కమాండ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు నేతలకు తమ నియోజకవర్గాలలో కార్యకర్తల బలం ఉండగా వివిధ నియోజక వర్గంలోనూ కార్యకర్తలకు దగ్గరై వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయంలో ఝాన్సీ రెడ్డి ఓ అడుగు ముందు ఉన్నారు. ఆమె నిత్యం జనగామ నియోజకవర్గంలో అన్ని మండలాల ముఖ్య లీడర్లతో మాట్లాడి.. స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇస్తూ దగ్గరయే ప్రయత్నం చేస్తున్నారు. చాప కింది నీరులా ఝాన్సీ రెడ్డి జనగామలో కొమ్మూరికి దీటుగా ఓ వర్గాన్ని తయారు చేస్తున్నట్లు సమాచారం జనగామలో నియోజకవర్గంలో ఇప్పటికే కొమ్మూరి  వర్గం, కిరణ్ కుమార్ గౌడ్ వర్గం రెండు వర్గాలుగా చీలిపోయాయి, నిత్యం ఝాన్సీ వర్గం కూడా కొమ్మూరి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తప్పించాలని చూస్తుంది. ఈ పరిమాణాల ను ఝాన్సీ రెడ్డి, ఇందిరా, కిరణ్ కుమార్ గౌడ్, అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నట్లు కార్యకర్తలు గుసగుస లాడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ త్వరలోనే కొత్త అధ్యక్షుడిని  నియమిస్తారని. తర్వాత డిసిసి అధ్యక్షులు మార్పు కూడా ఉంటుందని పలువురు  అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో జనగామ డిసిసి పీఠంపై ఇందిరా, ఝాన్సీ రెడ్డి  కిరణ్ గౌడ్  ప్రయత్నిస్తున్నాడంతో స్థానిక రాజకీయాలు ఒకసారిగా వేడెక్కుతున్నాయి.