03-11-2025 11:04:24 PM
కాప్రా (విజయక్రాంతి): మీర్పేట్ హెచ్.బి. కాలనీ డివిజన్లోని అన్నపూర్ణ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణాలకు సంబంధించి స్ధానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో నరసింహ గౌడ్, సంజయ్ నాయక్, ప్రేమ్ సాగర్, చంద్రశేఖర్, ప్రసాద్, రాజమల్లు, రాజలింగంతో పాటు కాలనీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.