11-08-2024 07:18:44 PM
పెద్దపల్లి: మంథని సర్కిల్ లోని ముత్తారం, రామగిరి మండలాలో ఆదివారం ఎస్ఐలు బాధ్యతలు స్వీకరించారు. రామగిరి ఎస్ఐగా పెట్టం చంద్రకుమార్, ముత్తారం ఎస్ఐ గోపతి రమేష్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించొద్దని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మధ్యవర్తిత్వం లేకుండానే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని తెలిపారు. మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐలు కోరారు.