calender_icon.png 11 November, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ గవర్నర్ పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

11-08-2024 07:02:46 PM

మంచిర్యాల: నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుగా నిలుస్తున్న మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆదివారం జిల్లా గవర్నర్ అధికారిక  పర్యటన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మొదట విశ్వనాథ ఆలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి నీ వాసవి క్లబ్స్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం గవర్నర్ పర్యటనలో భాగంగా మంచిర్యాల వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్, విజయం టీచర్స్ క్లబ్, విజయం వేంపల్లి ఈ క్లబ్, బి జోన్ ఈ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు నిరుపేదలకు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సలుకుల పంపిణీ, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం, ఏకలవ్యాశ్రమంలో బియ్యం, విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం, రెడ్ క్రాస్ సొసైటీలో వృద్ధులకు చేతి కర్రలు చెప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి మాట్లాడుతూ, వాసవి క్లబ్ డిస్టిక్ వి 107 ఏ పరిధిలో దాదాపు 50 క్లబ్బులు అనేక రకాల సేవా కార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం మంచిర్యాల ప్రాంతంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాసవి మాత పారాయణాలు, చలివేంద్రం లాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానాలు, నిరుపేదలకు వైద్య పరీక్షల నిమిత్తం రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మిగతా కాలంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు నిరుపేదలకు అందించాలని పిలుపునిచ్చారు.