తెలంగాణ అస్థిత్వాన్ని సరిచేసే దిశగా పాలన
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు
పటాన్‌చెరు, డిసెంబర్ 7: బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అస్థిత్వానికి జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేసే దిశగా పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.
శనివారం పటాన్‌చెరు మండలం బచ్చుగూడ గ్రామంలో కాంగ్రెస్ నియోజవకర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి నీలం మధు హాజరయ్యారు.
గ్రామం లో చేపట్టిన విజయోత్సవాల ర్యాలీలో మహిళలు మంగళహారతులతో నీలంమధు, మెట్టు సాయికుమార్, కాట శ్రీనివాస్‌గౌడ్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా కాంగ్రె స్ జిల్లా అధ్యక్షురాలు కాట సుధారాణి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నీలంమధును కలిసిన అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధును కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ శనివారం చిట్కుల్ గ్రామంలోని ఎన్‌ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నీలం మధు తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు నీలంమధును ఘనంగా సత్కరించారు.




