11 April, 2026 | 4:27 AM

పాలమూరు వీర పాట ఆవిష్కరణ

08-12-2024 01:47 AM

ముషీరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ‘పాలమూరు వీర’ అనే పాటను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శనివారం అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత రాచాల యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కవి, రచయిత రేలారే ప్రసాద్ రచించిన ఈ గీతం అద్భుతంగా ఉందని.. రేవంత్ ఒక్కడిగా వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మహేశ్  ప్రశంచారు.   గేయ నిర్మాత రాచాల యుగేందర్ గౌడ్, రచయిత రేలారే ప్రసాద్, సంగీతం అందించిన కల్యాణ్ కీస్, గాయకుడు ఎంఎల్‌ఆర్ కార్తికేయను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గాలిగల్ల సాయిబాబా, నవీన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.