calender_icon.png 20 September, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కామ్‌సెక్యూర్‌కు ప్రభుత్వ ఆమోదం

20-09-2025 12:58:04 AM

  1. సైబర్ నేరాలపై అవగాహనకు ప్రత్యేక వెబ్ సైట్‌ను సృష్టించిన అర్జున్ రామ్
  2. 16 ఏండ్ల వయసులోనే ఘనత

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మొబైల్ ఫోన్ల వినియోగంతో రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ప్రజలు సైబర్ మోసాలకు లోనవుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు జరిగే తీరు, వాటి నుంచి రక్షణ పొందడం, ఆన్‌లైన్ మోసాలను నివేదించడం,

ఆన్‌లైన్ వ్యాపారాల కమ్యూనికేషన్ల ప్రామాణికతను ధృవీకరించడానికి, సాధనాలను అందించడానికి హనుమకొండ జిల్లా నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలుడు అర్జున్ రామ్ ప్రత్యేకంగా స్కామ్ సెక్యూర్ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్‌సైట్‌కు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.

సామాజిక సమస్యల పట్ల ఎంతో స్పృహ ఉన్న అర్జున్ రామ్.. అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను రూపొం దించడం గమనార్హం. వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించి, ప్రజల సమస్యకు చెక్ పెట్టాలని అర్జున్ రామ్ సంకల్పిస్తున్నారు.