16-10-2025 05:29:37 PM
- శాంతిఖని గేటు మీటింగ్
- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి
బెల్లంపల్లి అర్బన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసి హక్కులను కాలరాసేoదుకు కుట్రలు చేస్తున్నాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. గురువారం శాంతికని గనిలో జరిగిన గేటు మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు పూర్తి లాభాల వాటాను ఇప్పించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. లాబాల వాటాలో కార్మికులను దగా చేశారనీ మండిపడ్డారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నప్పటికీ, పట్టించు కోకుండా ఇతర రాష్ట్రాల్లో ఖనిజాలను వెలికి తీస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెపుతుందని విమర్శించారు. సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు వేలాది కోట్ల లాబాలు తీసుకు వస్తే లాభాల్లో వాటా కార్మికులకు ఇప్పించడం లో ఐ ఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలు విఫల మాయ్యయన్నారు. శాంతిఖని, రామగుండం లోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టుల్లో భారీగా నష్టం వస్తుందని చెప్పడం దుర్మార్గమైన చర్యన్నారు.
ఈ గనులను మూసివేందుకు సింగరేణి సంస్థ కుట్రలో భాగంగానే ఇలా మాట్లాడుతుందన్నారు. గనులకు ఎంతో భవిష్యత్ ఉందన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణ ప్రతిష్టంబనకు గురైందన్నారు. ఇందుకు గుర్తింపు, ప్రాతి నిద్య సంఘాలు కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్తిపు కార్మిక సంఘం కార్మికుల పే షిట్ల లో చందాలను రికవరీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయం పై సింగరేణి సంస్థ డైరెక్టర్ పా కు ఫిర్యాదు చేసి అడ్డు కుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెల ల్లో ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ లు కార్మికులకు చేసిందేమి లేదన్నారు. సింగరేణి సంస్థ ను కాపాడేందుకు టీ బీ జీ కే ఎస్ పోరాటం చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికలసంపత్ కుమార్, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ లు మేడిపల్లి సంపత్, మల్రాజు శ్రీనివాసరావు, వెంకటరమణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజనాల రమేష్, సెంట్రల్ నాయకులు దాసరి శ్రీనివాస్, అనుముల. సత్యనారాయణ, సంపత్ కుమార్ ట్రెసరర్ సతీష్, శాంతి కని పిట్ కార్యదర్శి హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.