calender_icon.png 30 July, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లస్టర్ అధికారుల నియామకం

29-07-2025 04:00:41 PM

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో నిర్వహించే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ప్రజాసేవ కార్యక్రమాలను సమగ్ర పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి అధికారులను క్లస్టర్ వారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల్లో ప్రభుత్వ సేవల అమలు, క్రమబద్ధీకరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

సంబంధిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించిన అధికారులు ప్రత్యేకంగా నియమించిన క్లస్టర్ అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.  కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ కాటారం, మల్హర్ రావు, మహాదేవపూర్ మండలాలకు క్లస్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. అలాగే జిల్లా ఫారెస్ట్ అధికారి నవీన్ రెడ్డి మహదేవ్పూర్, పలిమెల, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ భూపాలపల్లి, ఘన్పూర్ (ములుగు), అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కొత్తపల్లి గోరి, రేగొండ, చిట్యాల, భూపాలపల్లి ఆర్డీవో రవి మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు క్లస్టర్ అధికారులుగా విధులు నిర్వహిస్తారని చెప్పారు.