29-07-2025 03:57:00 PM
తుంగతుర్తి(విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు & పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం"డాక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో వెంపటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అన్నారం డాక్టర్ బైన రమ్య, జెడ్పిహెచ్ఎస్ అన్నారం పాఠశాలలో మాట్లాడుతూ... పాఠశాల యందు వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వర్ష కాలంలో వర్షాలు పడడం వలన మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమల స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అవి కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధిగ్రస్తుల నుండి ఒకరి నుండి మరొకరికి కుట్టి వ్యాప్తి చేస్తాయని, ముఖ్యంగా ఈ వర్ష కాలంలో నీరు కలుషితం కావడం వలన,కలుషితమైన ఆహారం పదార్థాలు , ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన , టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు, కలరా సంభవించే అవకాశం ఉన్నందున వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, నీళ్ళు కాచి వడబోసి త్రాగాలని అవగాహణ నిర్వహించడం జరిగింది.