09-08-2025 07:34:14 PM
"మనం చెట్లకు రక్షణ-చెట్లు మనకు రక్షణ" అంటూ వినూత్నంగా రాఖీ పండగను జరుపుకున్న ప్రభుత్వ ఉద్యోగులు..
హుజూర్ నగర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రక్షాబంధన్. రక్షాబంధన్(Raksha Bandhan) సందర్భంగా అన్నదమ్ములకు రాఖీ కట్టి.. కలకాలం రక్షణగా ఉండాలని, అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు. కానీ హుజూర్ నగర్ లో మాత్రం అన్నా చెల్లెలు రక్షాబంధన్ ను వినూత్నంగా వృక్షాబంధన్ గా జరుపుకున్నారు. నేడు దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ నిర్వహించుకుంటుంటే... సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అన్నచెల్లి ప్రభుత్వ ఉద్యోగులైన ఇందిరాల రామకృష్ణ (హెల్త్ డిపార్ట్మెంట్), ఇందిరాల జ్యోతి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) వినూత్నంగా మనం చెట్లకు రక్షణ-చెట్లు మనకు రక్షణ అంటూ వృక్షాల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహించాలని వినూత్న రీతిలో రాఖీ పండుగ నిర్వహించారు. పట్టణంలోని వారి నివాసంలో సోదరికి మొక్కను బహుకరించి "వృక్షో రక్షతి రక్షితః" అంటూ వినూత్నంగా రక్షాబంధన్ మహోత్సవాన్ని జరుపుకున్నారు.