09-08-2025 07:32:03 PM
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Lakshmi Rajagopal Reddy) పుట్టినరోజు మునుగోడు మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవనపల్లి సైదులు పాల్వాయి జితేందర్ రెడ్డి, పందుల భాస్కర్, ఎండి అన్వర్, జాల మణికంఠ, పందుల నరసింహ, జంగిలి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.