09-08-2025 10:00:27 PM
ఘట్ కేసర్: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్(SI Shekhar) తెలిపిన వివరాల ప్రకారం... ఎగిడి రామకృష్ణ(45) అనే వ్యక్తి ఘట్కేసర్ మైసమ్మగుట్ట దగ్గర గల దామోదర్ రెడ్డి కోళ్ల ఫారం నందు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూర్ జిల్లా, వజ్రకరూర్ కు చెందిన అతను వలస వచ్చి భార్యా పిల్లలతో కలిసి మైసమ్మ గుట్ట దగ్గర కల కోళ్ల ఫారం నందు నివసిస్తున్నాడు.
ఈనెల 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు అతను ఇంటి నుండి బయటకు వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. రామకృష్ణకు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆమెతో వెళ్లిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పిపోయిన వ్యక్తి క్రీమ్ కలర్ షర్ట్, నల్ల ప్యాంటు, ఎత్తు 5.2'', రంగు నలుపు, చేతిపై టాటూ ఉంది. అతని గురించి భార్య పిల్లలు బంధుమిత్రుల వద్ద అన్ని చోట్ల వెతికిన ఎలాంటి ఆచూకీ దొరకపోవడంతో శనివారం రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.