09-08-2025 10:16:56 PM
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Lakshmi Rajagopal Reddy) పుట్టినరోజు వేడుకలు మర్రిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చికిత్స పొందుతున్నటువంటి రోగులకు, బ్రెడ్లు, పండ్లు పొలాలు అందించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేన్నమనేని రవీందర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచులు అంజయ్య, వెంకటయ్య, బిచ్చు నాయక్, రవి, మాజీ ఎంపీటీసీలు ఏర్పుల శ్రీశైలం, అందుగుల ముత్యాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడాల అల్వాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, రాజు నాయక్, పొనుగూటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.