09-08-2025 10:15:24 PM
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి..
ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బూత్ స్థాయి నుంచే యువజన కాంగ్రెస్ ను పటిష్టం చేయాలని మాజీ జెడ్పిటిసి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Congress President Gummula Mohan Reddy) అన్నారు. శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో గుమ్ముల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ లో క్రమ శిక్షణగా పనిచేస్తే వారికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అదేవిధంగా పార్టీ పరంగా పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని తెలిపారు.
యువజన కాంగ్రెస్ లో పనిచేసే కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అప్పుడే నాయకులుగా ఎదుగుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన విజయవంతం చేయడంలో యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. యువజన కాంగ్రెస్ నల్లగొండ నియోజక వర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జహంగీర్ బాబా, యువజన పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నల్లగొండ మండల అధ్యక్షుడు కె.వి.ఆర్ సతీష్, కంచర్ల ఆనంద్ రెడ్డి, కొప్పు నవీన్ ,పాదం అనిల్,సిద్ధార్థ, రంజిత్ , అజారుద్దీన్, సురేష్, జానకిరామ్, ముజ్జు, సయ్యద్ జానీ, మహమ్మద్ బిలాల్, దాసరి విజయ్, పరశురాం, అజ్జు, వసీం, వినయ్, హలీం ఖాన్ పాల్గొన్నారు.