09-08-2025 10:07:01 PM
ఆర్టీసీ కామారెడ్డి డిపో ఎడిసి తిరుపతి...
కామారెడ్డి (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణాశ్రీ(RTC Depot Manager Karunashri) ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో ఏడిసి తిరుపతి శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా సమీపంలోని ఐబి పాయింటును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. రక్షాబంధన్(Raksha Bandhan) సందర్భంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రయాణికుల పాయింట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. ఆదర బాదరాగా బస్సు ఎక్కి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. సంయమనం పాటించి బస్సులో క్యూ పద్ధతిలో బస్సు ఎక్కాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులు సమయస్ఫూర్తిగా బస్సును ఎక్కాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ పీజీ రాములు, ఆర్టీసీ డిపో కార్యాలయ సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు.