09-08-2025 10:20:59 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యపేట (విజయక్రాంతి): రాఖీ పండుగ అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. శనివారం బాలభవన్ లో చిన్నారులతో కలిసి రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బాలసదన్ లోని చిన్నారులు కలెక్టర్ కి రాఖీలు కట్టి, ఆప్యాయత పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారులు బాగా చదివి ప్రయోజకులుగా ఎదగాలని ఆకాక్షించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రెండు నెలలో నూతన చిల్డ్రన్ హోమ్ పూర్తి అవుతుందని తెలిపారు. తదుపరి చిన్నారులకు డ్రస్ లు, రైన్ కోట్స్, పెన్నులు, లూడో, చెస్, షటిల్ ఆట వస్తువులు మిఠాయిలు, బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాల సంరక్షణ అధికారి రవి, సూపరిటీడెంట్ మంగాతాయమ్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.