09-08-2025 10:09:11 PM
లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న..
మహబూబాబాద్ (విజయక్రాంతి): తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమని, పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న(Lions Club President Dr. Veeranna) అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు పారుపల్లి రమేశ్ బాబు, రాగ సుద దంపతుల పెళ్లి రోజు పురస్కరించుకొని మానుకోట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు రాగ సుధ దంపతులను క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మాధవ పెద్ది వెంకటరెడ్డి, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ జగదీశ్వర్, అనుమాల వెంకటేశ్వర్లు, డాక్టర్ వి. జగన్మోహన్ రావు, క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.