calender_icon.png 14 July, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలి..

26-05-2025 10:23:51 PM

కోదాడ: ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురికాకుండా చూడాలి అని ఆర్డీవో సూర్యనారాయణ(RDO Suryanarayana), తాహసీల్దార్ వాజిద్ అలీ(Tahsildar Wajid Ali) లకు తమ్మర బండపాలెం ఎస్సీ కాలనీ వాసులు వినతిపత్రం అందించారు. సోమవారం కోదాడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు మాట్లాడుతూ... 40 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం తమ్మర గ్రామదళితుల కోసం రెవిన్యూ సర్వేనెంబర్ 446/అ2/3 లో 9 ఎకరాల 24 గంటల భూమిని ఇళ్ల స్థలాలకు ఇళ్లు నిర్మించేందుకు కొనుగోలు చేసిందని తెలిపారు.

అట్టి భూమిలో ఏడెకరాల చిల్లర భూమిలో ఇళ్లను నిర్మించి ఇళ్ల ప్లాట్లు ఇవ్వటం జరిగిందని దానిలో కొంత భూమి మిగలడంతో నాటి నుండి నేటి వరకు ఎస్సీ కాలనీ వాసులు పెంటదిబ్బలకు బహిర్ భూమికి గత 20 సంవత్సరాల నుండి వాడుకుంటున్నారు. కాల క్రమంలో ప్రస్తుతం భూములకు ధరలు రావడంతో కనగాల కొండయ్య, వారసులు వెంకటేశ్వరరావు, కుమారులు కనగాల కొండయ్య, కనగాల పూర్ణయ్య అట్టి భూమిపై కన్ను వేసి కబ్జా చేసేందుకు ఆలోచనతో గ్రామములోని వ్యక్తులను భూమి పైకి వచ్చి ఎస్సీ కాలనీ వాసులపై దౌర్జన్యం చేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.

అట్టి భూమిని కాలనీవాసులకి తగ్గాలని సోమవారం పెద్ద ఎత్తున పురుషులు మహిళలు కాలనీవాసులు ఆర్డిఓ ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దీనిపై అధికారులు స్పందించి తప్పకుండా ఎస్సీ కాలనీ వాసులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నం జాన్ బాబు, సిద్దెల ప్రసాదు, వంగూరి వెంకటరత్నం గుండె రాజేష్, వంగూరి వెంకటి, మంగళంపల్లి వెంకటేశ్వర్లు, వంగూరు గోపి, చిన్నం వెంకటేష్, కురుమూర్తి శ్రీను, చిన్నం రవి, సిద్దెల కార్తీక్, మహిళలు సునీత, నాగలక్ష్మి, సునిత, చిట్టెమ్మ మార్తమ్మ మరియమ్మ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.