calender_icon.png 20 September, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను అమలు చేయండి

20-09-2025 12:00:00 AM

-మద్యం షాపుల్లో రిజర్వేషన్ పెంచి గీత సొసైటీలకే ఇవ్వాలి

-సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి

-మంత్రి జూపల్లికి బీజేపీ నేత డా. బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి

-గీత కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేత 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) :  ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా హామీలు అమలు కాకపోవడంతో గీత కార్మికులు నిరీక్షణలో ఉన్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య అన్నారు. శుక్రవారం మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. 

మద్యం దుకాణాల రిజర్వేషన్ పెంచి గీత సోసైటీలకే కేటాయించాలని, కల్లుగీత వారికి రాష్ట్ర సోసైటీ ఏర్పాటు చేయాలని, ఎక్స్‌గ్రేషియా బకాయులు చెల్లించడంతో పాటు రూ. 10 లక్షల వరకు పెంచాలని కోరారు. తాటి సాగును ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చి జాతీయ సబ్సిడీలు కల్పించాల న్నారు. ఐసీఏఆర్ ఆమోదించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి తాటి హైబ్రిడ రకాలపై పరిశోధన చేపట్టాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటును పూర్తి చేయాలని కోరారు.