08-01-2026 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, జనవరి 7 (విజయక్రాంతి): ములుగు మండలం బస్వాపూర్ గ్రామం నుండి సింగన్నగూడ జిల్లా పరిషత్ పాఠశాలకు అనేకమంది విద్యార్థులు విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారని కొక్కొండ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యులు గోదా అరుణ్ యాదవ్ మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ కే పరిమళ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
అందులో అమ్మాయిలు అబ్బాయిలు రెండు కిలోమీటర్ల మేరకు కాలినడకన పాఠశాలకు రావడం బాధాకరమని కాబట్టి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్వాపూర్ వరకు వస్తున్న మేడ్చల్ ఆర్టిసి డిపో బస్సును సింగన్నగూడ జిల్లా పరిషత్ పాఠశాల వరకు పెంచాలని అరుణ్ యాదవ్ మేనేజర్ పరిమళకు విజ్ఞప్తి చేస్తుంటే తెలిపారు.ఈ కార్యక్రమంలో 9వ వార్డు సభ్యులు బద్రి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.