07-05-2025 05:11:05 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కునే సన్నద్దతను పరీక్షించేందుకు నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ ముగిసింది. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో హైదరాబాద్ లో మాక్ డ్రాల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, అపార్డ్ మెంట్ల వద్ద రెండు నిమిషాల పాటు పెద్దగా సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ అని, ప్రజలు, సహాయక సిబ్బంది వ్వవహరించాలన్సిన విధానంపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ లోని 4 ప్రాంతాలైన నానల్ నగర్, కంచన్ బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ లో రక్షణశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించామని పేర్కొన్నారు. రెండు నిమిషాలపాటు సైరన్ మోగించి అప్రమత్తం చేశామని, 4 ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లు మాక్ డ్రిల్ చేశామని, క్షతగాత్రులను తరలించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. అగ్నిమాపక, వైద్య సిబ్బంది చేపట్టే చర్యలపై, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు భయపడొద్దని సీపీ సూచించారు.అత్యవసర పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ అని, జరిగిన లోపాలను సమీక్షించుకుని మరింత మెరుగ్గా చేస్తామని తెలిపారు. ప్రజలు ఫేక్ వార్తలను నమ్మి భయపడొద్దని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.