07-05-2025 05:25:06 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆరాధన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి అయిన సందర్భంగా యజ్ఞం నిర్వహించి పూజా కార్యక్రమాలను చేపట్టారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ నాయకులు పాల్గొన్నారు.