calender_icon.png 20 September, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నియంత్రణ అవసరం!

19-09-2025 12:00:00 AM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌లు పిల్లల మానసిక, శారీరక భద్రతకు పెనుముప్పుగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల ద్వారా పోర్నోగ్రఫీ, హింసాత్మక కంటెంట్‌కు వ్యసనపరులవుతున్నారు. ఈ నేరాలు శ్రుతి మించకముందే ప్రభుత్వం వీటి నేపథ్యాన్ని అధ్యయనం చేసి చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకోవాలి. సామాజిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఇతరులను వ్యక్తులు, ముఖ్యంగా పిల్లలు గమనించడం ద్వారా, అనుకరించడం ద్వారా ప్రవర్తనలను నేర్చుకుంటారు.

స్మార్ట్‌ఫోన్‌లలోని హింసాత్మక, అశ్లీల కంటెంట్ నిరంతర వీక్షణం వారిలో ఆ ప్రవర్తనలను సాధారణీకరించడానికి, సున్నితత్వాన్ని కోల్పోవడానికి దారి తీస్తుంది. ఇప్పటికే బ్రిటన్‌లో 16 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ల విక్రయాన్ని నిషేదించే ప్రతిపాదనపై చర్చ జరుగుతుంది. భారత్‌లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ 11 ఏళ్లకే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతూ కాలం గడుపుతున్నారు.

నిజానికి బ్రిటన్ కంటే ముందు భారత్‌లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ల్ల వాడడంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇందుకు తల్లిదండ్రుల ఆందోళనను, సూచనలను పరిగణలోకి తీసుకొని చట్టాన్ని రూపొందించాలి. స్మార్ట్‌ఫోన్ల వ్యసనం మన పిల్లల బాల్యాన్ని, మన సమాజ భద్రతను నాశనం చేయకముందే ప్రభుత్వాలు తక్షణమే స్పందించాల్సిన అవసరముంది.

 శ్రీనివాస్, కరీంనగర్