calender_icon.png 20 September, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ ముందస్తుగా చెల్లించాలి

19-09-2025 12:00:00 AM

దేశంలో దేవి నవరాత్రుల పండుగ,తెలంగాణలో బతుకమ్మ పండుగలు ఘనంగా జరుపుకోవడం ఒక సంప్రదాయం. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాను ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటారు. అందుకు కంపెనీలు బోనస్‌ల రూపంలో డబ్బులు చెల్లించి మరింత ఆనందపరుస్తాయి. ఈ నేపథ్యంలో సింగరేణి పెన్షన్ దారులకు కూడా ముందస్తు చెల్లింపులు చేస్తే పండుగను ఆనందంగా జరుపుకోవడానికి వీలు ఉంటుంది.

అయితే బ్యాంకులకు వరుస సెలవులతో పెన్షన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దుర్గాష్టామి మొదలుకొని వరుసగా 4వ శనివారం, ఆదివారం, గాంధీ జయంతి ఇలా వరసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు ఉండే అవకాశముంది. ఈ సెలవుల దృష్ట్యా పెన్షనర్లకు బ్యాంకులు పెన్షన్ డబ్బులు ముందస్తుగా చెల్లించాలని కోరుతున్నారు. దీనివల్ల పండుగ సంబరాలు ఘనంగా జరుపుకునే అవకాశముంది.

కోల్ మైన్స్ ప్రా విడెంట్ ఫండ్ అధికారుల కూడా సెలవులకన్నా ముందే బ్యాంకులలో పెన్షన్ జమ చేయడం వలన ఐదు లక్షల బొగ్గు పెన్షన్దారుల కుటుంబాలలో పండుగ వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అధికారులను కలిసి ముందస్తు పెన్షన్ విడుదల చేయాలని వినతిపత్రం అందించారు. పెన్షన్ దారులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.

 వేణు మాధవ్, హైదరాబాద్