06-01-2026 12:52:29 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జనవరి 5 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేగంగా ప్రజలకు అందేటట్లు జిల్లా అధికారులు కష్టపడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికా రులు ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలని తెలిపారు. పిల్లలకు వసతి గృహాల్లో కల్పిస్తున్న వసతులు, తదితర వివరాలు అన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లలో తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు.
జిల్లాలో యూరియా పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందికి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన పుష్కర ఘాట్ల ఏర్పాట్ల గురించి, తహశీల్దార్లు నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు వెంటనే అందించాలని తెలిపారు. అనంతరం ఎస్సీ విద్యార్థులకు అందించే ఉపకారవేతనాలకు సంబంధించి, కలెక్టర్ అధికారులతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మేడం... మా గోస వినండి
నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులైన తల సేమియా ఎమోసోఫి సెల్లో సెల్ రోగాలతో బాధపడుతున్న బాధితులకు నిర్మల్ జిల్లాలో సదుపాయాలు కల్పించాలని కోరుతూ తల సేమియా బాధితుల సంఘం జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.నిర్మల్ జిల్లాలో 200 మంది బాధితులు తమ పిల్లలను కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని సదుపాయాలు కల్పించాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాధితుల సంఘం మన్సూర్ అహ్మద్ బాధితులు పాల్గొంటున్నారు.