06-01-2026 12:56:13 AM
ఓటర్ జాబితాలో తప్పిదాలు
ఆందోళనలో రాజకీయ పార్టీల నాయకులు
అభ్యంతరాలు స్వీకరిస్తున్న అధికారులు
రిజర్వేషన్ ఖరారుపై ఎదురుచూపు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 5(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేయడం తో జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో రాజకీయ వేడి మొదలైంది. ఆసిఫాబాద్ మున్సిపా లిటీగా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆశావహులు ఎన్నికల బరిలో పోటీకి దిగనున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలోనీ వార్డుల ఓటర్ జాబితా సవరణల కోసం అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు.
ఈనెల 7న కలెక్టరేట్‌లో పలు రాజకీయ పార్టీ ల నాయకులతో కలెక్టర్ అధ్యక్షతన సమావే శం నిర్వహించనున్నారు.10న తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 13,905 మంది ఓటర్లు ఉన్నారు.
ఓటర్ జాబితాలో తప్పిదాలు...
మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలలో నోటీస్ బోర్డుపై పెట్టిన ఓటర్ జాబితాలలో పెద్ద ఎత్తు న తప్పిదాలు దొర్లినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారులు ఓటర్ జాబితాల రూపకల్పనలో నిబద్దత లోపించిందని విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిం చకుండానే ఓటర్ జాబితాను రూపొందించినట్లు బహిరంగంగా చర్చ జరుగుతుంది.ఓటర్ జాబితాలో తప్పులను సవరించేందుకు అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు.
ఓటరు తుది జాబితా విడుదలపై ఈనెల 7న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఓకే ఇంటి నెంబర్‌లో నివాసముంటున్న కుటుంబ సభ్యుల ఓట్లు వేరువేరు వార్డులలో నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మరి కొన్ని వార్డుల్లో మృతి చెందిన వారి ఓట్లు సైతం ఉండడం గమనార్హం. ఇంతే కాకుండా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మీ 20 వార్డుల్లో ఓటర్ల వ్యత్యాసం సైతం నెలకొంది. ఏది ఏమైనా పడితే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఓటును వినియోగించుకునేందుకు అధికారులు జాబితాను సరిచేయాలని కోరుతున్నారు.
ఆసిఫాబాద్‌పై అన్ని పార్టీల కన్ను..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు అయినా అనంతరం మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలపై అధికార పార్టీ కాంగ్రెస్, బిఆర్‌ఎస్,బిజెపి పార్టీలో తమ అధిపత్యాన్ని చూపించుకునేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు వేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు జిల్లా కేంద్రంలోని నివాసం ఉండడంతో తమ మనుగడ కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, బిజెపి సీనియర్ నేత అరికెల నాగేశ్వరరావు ఆసిఫాబాద్‌లో నివాసం ఉంటున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తన మకాంను ఇటీవల జిల్లా కేంద్రానికి మార్చింది. ఏది ఏమైనాప్పటికీ ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలెంజ్‌గా మారే అవకాశం ఉంది.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..!
మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొం ది.వీటితోపాటు వార్డులలో రిజర్వేషన్ల కేటాయింపు పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇప్పటినుండే పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్ జాబితాలను పరిశీలించి లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వే షన్ ఖరారు కాకముందే తమకు అనుకూలం గా రిజర్వేషన్ కలిసివస్తే కౌన్సిలర్ గెలుపుపై ఆశావాహులు ముందుకు సాగుతున్నారు. మరికొందరు ఒక్క అడుగు ముందుకు వేసి ఓటర్ జాబితాలో తనకు అనుకూలంగా ఉన్న ఓటర్లను అండర్లైన్ చేసుకుంటూ లెక్కలు వేసుకుంటు న్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలోనూ ఈసారి రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని ఒకవేళ మారితే అవార్డులో పోటీ చేయాలో అనే ఆలోచనలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు.