calender_icon.png 6 November, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

06-11-2025 07:16:45 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 41 ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని తెలిపారు. టీచర్లు చిత్తశుద్ధితో పనిచేసి పిల్లల్లో అభ్యాసంపై ఆసక్తి పెంపొందించాలని సూచించారు.

ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకు యూనిఫార్ములు, ఆట వస్తువులు, పేయింటింగ్స్, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లు నవంబర్ చివరి నాటికి పూర్తిచేస్తామని చెప్పారు.3–6 ఏళ్ల పిల్లల్లో మేధో వికాసం కీలకమని, ప్రేమ, ఆప్యాయతలతో బోధించి మంచి విలువలను నేర్పాలని సూచించారు. జిల్లాలో పదవ తరగతి ఫలితాలు మెరుగుపడేందుకు ప్రీ ప్రైమరీ దశ నుంచే పునాది బలపర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.