calender_icon.png 6 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న వందేమాతర గేయం సామూహిక గీతాలాపన

06-11-2025 07:12:02 PM

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య

మంచిర్యాల, (విజయక్రాంతి): వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య గురు వారం తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ/ స్థానిక సంస్థల/ ఎయిడెడ్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమ సంబంధిత ఫోటోలు, వివరాలతో అదే రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.