24-09-2025 06:51:03 PM
ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ
నకిరేకల్,(విజయక్రాంతి): మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ డిమాండ్ చేశారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ జనవరి 25 నుండి 28 తేదీలలో హైదరాబాదులో జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అందజేయాలని డిమాండ్ చేశారు. కేవలం సమబావన సంఘాల సభ్యులకు మాత్రమే పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం ఆలోచన ను విరవించుకోవాలన్నారు.