calender_icon.png 24 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ రాష్ట్రకన్వీనర్ గా పగిళ్ల సందీప్

24-09-2025 06:47:02 PM

నకిరేకల్,(విజయక్రాంతి): చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ గా మండలంలోని నోముల గ్రామానికి చెందిన పగిళ్ల సందీప్ ఎన్నికయ్యారు. బుధవారం సందీప్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే 130వ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీకి రాష్ట్ర కన్వీనర్ గా తనకు చోటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

నాడు భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం గొప్పదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. తన నియామకానికి కృషి చేసిన ఉత్సవాల కమిటీ చైర్మన్, కో చైర్మన్లు ,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కొన్నే సంపత్, కొలుకులపల్లి రాధిక  కృతజ్ఞతలు తెలిపారు.