calender_icon.png 23 November, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డికి సీపీఐ మద్దతు

10-02-2025 01:20:28 AM

కరీంనగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుకున్నట్లు సీపీఐ జాతీయ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని సీపీఐ జిల్లా కార్యదర్శుల సమావేశు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన నరేందర రెడ్డికి మద్దతు ప్రకటించి, నరేందర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్, గుంటి వేణు, తాండ్ర సదానందం, వెన్న సురేష్, రామడుగు లక్ష్మణ్, మడుపు ప్రభాకర్ రెడ్డి, భిక్షపతి, పి సుధాకర్, విలాస్, పాల్గొన్నారు.