calender_icon.png 20 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై సోయిలేని మాటలు

18-08-2025 02:07:59 AM

హరీశ్‌రావుపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు సో యి లేకుండా మాట్లాడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ కడితే ఈ పరిస్థితి వచ్చేది కాద న్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిందనే విషయం హరీశ్‌రావుకు గుర్తుకు లేదా అని మండిపడ్డారు.

కాళేశ్వరం కూలినప్పుడే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశార ని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయొద్దని చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లు బాంబులు పెట్టారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అ య్యారు. బీఆర్‌ఎస్ అవినీతి వల్లనే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసి ఆ బ్యారేజ్ కొట్టుకుపోయి తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని హరీశ్‌రావు చూస్తున్నారని ఆరోపించారు.