calender_icon.png 7 September, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

31-08-2025 12:00:00 AM

  1. జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం
  2. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా బీసీలదే అంతిమ విజయం
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ, ప్రత్యేక జీవో ద్వారానే ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య పేర్కొన్నారు. ఇది అత్యంత హర్షించదగ్గ పరిణామమని, బీసీల రాజకీయ సాధికారత దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని ఆయన కొనియాడారు.

శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీ య ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయానికి బీసీల పక్షాన ధన్యవాదాలు తెలుపుతు న్నామ న్నారు. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్‌కు ఆమోదంపొంది, తక్షణమే జీవో జారీ చేసి ఎన్ని కల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.

‘రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసింది. ఇప్పుడు జీవో జారీ చేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ నిర్ణయాన్ని ఎవరైనా సుప్రీంకోర్టులో సవాలు చేసినా, అంతిమ విజయం బీసీలదే అవుతుంది. ఎందుకంటే రాష్ర్టంలో అత్యధిక జనాభా బీసీలదే, అందుకు సంబంధించిన జనాభా లెక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యా యపరమైన సమస్యలు ఎదురైనా కేసు గెలిచే అవకాశం బలంగా ఉంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం లో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు మురళీధర్ స్వామి, రాజ్‌కుమార్, సూర్యనారాయణ, రవి యాదవ్, బాలయ్య, బాలస్వామి పాల్గొన్నారు.