29-08-2025 03:19:10 AM
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు
ఖైరతాబాద్, ఆగస్టు 28(విజయ క్రాంతి) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహా గణపతికి బుధవారం తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ తొలి పూజ నిర్వహించారు. 20 మంది సిద్ధాంతాలు కలశపూజ, ప్రాణ ప్రతిష్ట నిర్వహించి గణేశునికి గాయత్రి యజ్ఞోపవితాన్ని వేశారు.అనంతరం గవర్నర్ కు పూర్ణకుంభంతో ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ ఖైరతాబాద్ మహా గణేష్ నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరిన గణేశుడు
71 సంవత్సరాల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహా గణేశుడు ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి రూపంలో 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమీతుడుగా కొలువుదీరాడు. జోరు వర్షంలోనూ బారులు తీరిన జనం ఖైరతాబాద్ మహా గణేష్ ని తొలిరోజు పూజా కార్యక్రమంలో జోరున వర్షం కురుస్తున్న జనాలు బారులు తీరారు. దీంతో బడా గణేష్ ని ప్రాంగణం మొత్తం జన సంద్రం గా మారింది.