29-08-2025 03:21:03 AM
కుత్బుల్లాపూర్, ఆగష్టు 28 (విజయక్రాంతి): ఓ వైపు నగరంలో అక్రమ నిర్మాణ దారులపై హైడ్రా కొరడా ఝులిపిస్తుంటే, మరోవైపు కొందరు కబ్జా దారులు హైడ్రా అంటే ఏమాత్రం భయం లేకుండా చాప కింద నీరులా తమ పని తాము చేసుకుం టూ పోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ధర్జాగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ రెవెన్యూ యంత్రాంగం, హైడ్రా అధికారులకు సవాల్ విసురుతున్నారు.
కుత్బుల్లా పూర్ మండలం గాజులరామారం సర్వే నెంబర్ 329 బతుకమ్మ బండలో ఓ కబ్జా దారుడు ధర్జాగా ప్రభుత్వ స్థలంలో మట్టిని పూడ్చుతూ అక్రమ గదులను నిర్మిస్తున్నాడు. వారాంతం సెలవులు,ప్రభుత్వ సెలవులలో అక్రమ గదులను నిర్మిస్తూ పేదలకు అమ్మి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నా డు.
గుట్టు చప్పుడు కాకుండా నిర్మిస్తున్న ఈ అక్రమ నిర్మాణాలకు కుత్బుల్లాపూర్ మండల వీఆర్‌ఏలు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా సర్వే నెంబర్ 329 లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రెండు అక్రమ గదులు నిర్మించాడని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
సర్వే నెంబర్ 329 లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న విషయంపై ఆర్‌ఐ ఖలీం ను వివరణ కోరగా అక్రమ గదులు నిర్మిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.మా వీఆర్‌ఏలకు అక్కడి కబ్జా స్థలాన్నిపరిశీలించమని చెప్పాను. వారి రిపోర్ట్ తో పాటు నేనే స్వయంగా వెళ్లి కబ్జా స్థలం, నిర్మించిన అక్రమ గదులను జేసిబీ తీసుకువెళ్లి నూతన రూములు కూల్చివేస్తానన్నారు.
ఆర్‌ఐ ఖలీం,
కుత్బుల్లాపూర్ మండల