calender_icon.png 6 December, 2024 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

27-08-2024 03:08:15 PM

గవర్నర్ కు ఘన స్వాగతం

ములుగు, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ తోలుత యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్ మార్గంలో ములుగు జిల్లాకు  అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యరితులతో గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై కలెక్టర్ ను అడిగి తెలుసు కున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి పై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.