28-07-2025 12:43:35 AM
కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల జూలై 27(విజయక్రాంతి)గ్రామ పాలన అధికారులు జీపీఓ, లైసెన స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సిరిసిల్ల పట్టణం లోని గీతానగర్ జిల్లా పరిషత్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు.
నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ సూచించారు.ఉదయం 10 .00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గం ట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 39 మంది అభ్యర్థులకు గాను 35 మంది హాజరయ్యారని, నలుగురు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు.లైసెనస్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు గాను 141 మంది హాజరయ్యారని 15 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు.
కాగా, లైసెనస్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సెకండ్ సెషన్ లో జరిగే ప్లాటింగ్ పరీక్షకు 156 మంది అభ్యర్థులకు గాను 139 మంది హాజరయ్యారని 17 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి, సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.